పిల్లలు భాష నేర్చుకోవడం కష్టమా..?

ఆలోచిస్తూ కూర్చున్న నాకు ఒక విషయం గురించి అంతు చిక్కటం లేదు.
అది – పిల్లలు భాష నేర్చుకోవటానికి ఎందుకు కష్టపడుతున్నారు ? మాతృభాషా కానీ, పర భాషా కానీ.
ఈ ఆలోచన లో నాకు తట్టింది ఊహ తెలియనప్పుడు, అక్షరాలు అనేవి ఉన్నాయని కూడా ఊహలో లేనపుడు … బుడి బుడి నడకల పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ? ఇందులో తెలియని రహశ్యం ఏమి లేదు. శబ్దం విని, సందర్భం అనుసరించి పదం అర్ధం చేసుకుని మాట్లాడారు. వారి మాటలకి రూపం లేదు, శబ్దమే ఉంది.
కాని బడికి వెళ్ళగానే, శబ్దం మరుగున పడి రూపం వచ్చేస్తుంది. అందరూ అన్నీ మరచి అక్షర రూపం ముఖ్యమని నొక్కి వక్కాణించడం మొదలు పెడతారు. ఇక మొదలు అవుతుంది, ఎప్పుడు రాయడం మొదలు పెడతారు ? దీనికి కారణం రాయడం వస్తే ముందుకు వెళతారు అది 3 సంవత్సరాల పిల్లలకి కూడా వర్తిస్తుందని అందరికీ గట్టి నమ్మకం.
ఏదైనా నా ఆలోచన మీద నడిపించడం అహంకారమే అవుతుంది.
అందుకే ఇది అందరి ముందుకు తెస్తున్నాను. విజ్ఞులు, నా ఆలోచనా విధానం గురించి వారి అభిప్రాయాలు చెపితే ముందుకు వెళ్ళడం ఆనందదాయకం అవుతుంది.
నా ప్రయోగం
మన విద్య విధానం 3 భాషాలు తప్పని సరి అని చెపుతోంది. మాతృభాష, రాష్ట్ర భాష, ఆంగ్లము. సరే మన దేశం, దాని స్వరూపం తీసుకుంటే మనకు ఎన్నో భాషాలు ఉన్నాయి. మాతృ భాష కాక వేరే మాట్లాడాలంటే, ఇతర భాషను గుర్తించటం ఎలా ? అ – నాకు తెలుగు కాని అదే అ – హిందీ లేదు కొరుకుడు పడటం లేదు, A – తెలుసు కాని దాని శబ్దం –ఏ అవుతుందా లేదా –అ,ఆ (ఆపిల్) అవుతుందా ?
ఒక దీనికి ఒక చిన్న ప్రయోగం
A – ఆ/అ అ – a अ – అ- a
దీని వల్ల సులువు అవుతుందా – శబ్దం, అక్షరం గుర్తింపు
దీనిని గునిన్తాలకి కూడా వర్తించవచ్చు. రాసెటప్పుడు లిపి లో మనకు ఇక్కడే ఎక్కువ తప్పులు కనిపిస్తాయి.
కా – కాకి kaa- cat का- कागज
ఇల్లనే మొత్తం గుణింతాలకు, ద్విత్వక్షరాలకు, సంయుక్తాక్షరాలకు – వర్తింపచేసి, శబ్ద పరచయం, ఉచ్చారణ మెరుగు పరచ వచ్చు.
అట్ట – రెండు ట లు. butter – రెండు ట లు चट्टान – రెండు ట లు
దీని వాళ్ళ ద్విత్వాక్షరాలు ఎలా పలక వచ్చో అన్న అవగాహన, ఏ భాషాలు అర్ధం అయినా మిగిలిన రెంటికి వర్తింప చేయవచ్చు.
కొన్ని ఉదాహరణాలు – ప్రగతి – ప + ర, proper – ప + ర, प्रकाश – प + र
పైన చెప్పినది క్లుప్తంగా అమలు చేయ కలిగిన విధానం.
అన్ని అక్షరాలకు, పద జలాలకు వర్తించక పోవచ్చు. కానీ ముందు శబ్దగ్రహణకీ, ఉచ్చారణకి, గుర్తింపుకి తోడ్పడుతుందని అనుకుంటున్నాను.
విమర్శలకి, ఇంకొన్ని సలహాలకి, ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తాను. విజ్ఞుల అభిప్రాయాలు మార్గదర్శకం గా పని చేసి తప్పు దారిలో వెళ్ళకుండా ఆపుతాయని అనుకుంటున్నాను.
-అపర్ణ
గుణింతాలు
Telugu |
గుణింతము |
Hindi |
मात्रायें |
English |
అ |
|
अ |
|
A-bat |
ఆ |
ా |
आ |
ा |
aa-car |
ఇ |
ి |
इ |
ि |
e-eat |
ఈ |
ీ |
ई |
ी |
ee-seat |
ఉ |
ు |
उ |
ु |
u-put |
ఊ |
ూ |
ऊ |
ू |
oo-pool |
ఋ |
ృ |
ऋ |
ॅ |
Ru- |
ౠ |
ౄ |
x |
x |
Roo-room |
ఎ |
ె |
ए |
े |
Ye-yes |
ఏ |
ే |
x |
x |
Yea-area |
ఐ |
ై |
ऐ |
ै |
i-ice |
ఒ |
ొ |
ओ |
ो |
o-omit |
ఓ |
ో |
x |
x |
oo-over |
ఔ |
ౌ |
औ |
ौ |
Au-out |
అం |
ం |
अं |
ं |
Am-ram |
అః |
ః |
अः |
ः |
Aha- |
బాగుంది మేడం
ఆలోచనలు అన్వేషణ వైపు, ప్రయోగం వైపు మరియు ఫలితం సాధించేవరకు కొనసాగించడం గొప్పవాళ్ళ లక్షణం. మీ ప్రయత్నం మీలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది మీ ప్రయత్నం ఇంతటితో ఆపకుండా ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను.
మీ ఆలోచనా విధానం నచ్చి, చిన్నవాడిని అయినప్పటికీ స్పందిస్తున్నందుకు ఏదైనా పొరపాటుగా రాసినట్లయితే క్షమించగలరు అని ముందే కోరుతున్నాను.
నేను ప్రస్తుతం ఆంగ్ల ఉపాధ్యాయుడిని, కానీ పల్లెటూరు లో పుట్టి పెరిగిన వాడిని కావున మీకు వచ్చిన ఆలోచనలు నాకు కూడా చిన్న వయసులో వచ్చాయి. ఆంగ్ల ఉపాధ్యాయుడిని అయిన తర్వాత నా ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది. బహుశ మీ రచనకు నా అభిప్రాయానికి కొంత దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ కొంత విభేదిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది.
అవసరాన్ని బట్టి మనము భాషను మాట్లాడుతాము. ఉదాహరణకు మన తల్లి ఏ భాషలో మాట్లాడుతుందో ఆ భాష మనకు స్పష్టంగా ముందుగా వస్తుంది ఎందుకంటే అవసరం మాతృభాషను నేర్పిస్తుంది. ఆ తర్వాత మన ఇంటి పరిసరాలలో ఏ భాష మాట్లాడేవారు ఎక్కువ ఉంటే ఆ భాష మాట్లాడడం మనకు కూడా వస్తుంది, ఎందుకంటే ఆ భాష మాట్లాడడం అవసరం. అదేవిధంగా రాయడం, వివిధ అంశాలలో పాండిత్యాన్ని ప్రదర్శించడం కూడా అవసరాన్ని బట్టి వస్తుంది. నాకు తెలిసినంత మట్టుకు దీన్ని నేర్పడం అనరు పొందడం అంటారు. నా అభిప్రాయం చదివిన తరువాత మీ అభిప్రాయం లో ఏదైనా మార్పు కు అవకాశం ఉంటే మార్చుకొని విజయవంతంగా ముందుకు వెళ్ళగలరు. ఒకవేళ మీ అభిప్రాయమే సరైనది, నా అభిప్రాయంలో స్పష్టత లేదు అనిపిస్తే, నా అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవద్దు. మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను.
శుభాకాంక్షలు మేడమ్
మీ శ్రేయోభిలాషి
అడ్డిచర్ల సాగర్
9346474070
Wow, wonderful blog layout! How lengthy have you been running a blog for? you made running a blog look easy. The full look of your website is excellent, let alone the content material!!