TS: దంపతుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో స్పౌస్‌కేసులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకేచేట పనిచేసేలా స్పౌస్ కేసులను పరిశీలించనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగ్‌లలో చేరాకే స్పౌస్ కేసుల కింద దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే ఉద్యోగులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముందు కొత్త పోస్టింగ్‌లలో చేరిన తర్వాతే అప్పీల్‌కు అవకాశం కల్పించారు.
జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి దరఖాస్తు చేయాలి. జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులు వారి శాఖాధిపతులకు దరఖాస్తుచేసుకోవాలి. శాఖాధిపతులు స్పౌస్‌కేసు దరఖాస్తులన్నింటినీ త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ఆదేశింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.