వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవతున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రూ. కోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవతున్నా అధికారులు స్పందించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫిర్యాదుతో మంత్రి అధికారులను అప్రమత్రం చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అదికారులపై కఠిన చర్లయు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావసరాలకు ఉపయోగపడాల్సిన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.