తెలంగాణ డిజిపిగా సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర డిజిపిగా సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డిజిపిగా జితేందర్ నియమితులైన అనంతరం సిఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు డిజిపిగా ఉన్న రవిగుప్తా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ రైతు కుటుంబానికి చెందినవారు. 1992 ఐపిఎస్ బ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ముందుగా నిర్మల్ ఎఎస్‌పిగా పనిచేశారు. తర్వాత బెల్లంపల్లి ఎస్‌పిగా.. మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్‌గా కూడా పనిచేశారు. 2004 నుండి 2006 వరకు ఢిల్లీ సిబిఐలో గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. విశాఖపట్టణం రేంజ్‌లో డిఐజిగా.. ఎపి సిఐడి, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా.. తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డిజిపిగా, జైళ్లశాఖ డిజిగా పనిచేశారు.