రేపు ఒయు మోడ‌ల్ కెరియ‌ర్ సెంట‌ర్‌లో జాబ్ మేళా..

డిగ్రీ అర్హ‌త క‌లిగిన‌ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ నెల 29వ తేదీన ఒయులోని ఎంప్లాయిమెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టైడెన్స్ బ్యూరో (మోడ‌ల్ కెరియ‌ర్ సెంట‌ర్‌)లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. రిల‌య‌న్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ప్లానింగ్ ఆఫీస‌ర్ ఉద్యోతాల కోసం ఈ జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు బ్యూరో డిప్యూటి చీఫ్ టి. రాము ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. అభ్య‌ర్థులు కనీసం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 29 నుండి 45 ఏండ్ల వ‌య‌సు క‌లిగి ఉన్న మహిళ‌లు హాజ‌రుకావ‌చ్చు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు బ‌యోడేటాతో పాటు స‌ర్టిఫికెట్ల‌ను తీసుకురావాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.