AP: మెగా జాబ్ మేళా..

కడప (CLiC2NEWS): నగరంలోని పల్లవోలు సమీపంలోని సిబిఐటి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వైఎస్ ఆర్‌సిపి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షడు, కడప మేయర్ కె.సురేష్ బాబు జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ జాబ్‌మేళాలో ఎంపి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 250 కంపెనీలు పాల్గొంటున్నాయి. అభ్యర్థులు వైఎస్ ఆర్‌సిపి వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్టు చేయవచ్చని తెలిపారు.