జర్నలిస్టుల బస్‌పాస్ గడువు 3 నెలలు పొడిగింపు

హైదరాబాద్ (CLiC2NEWS): జర్నలిస్టుల బస్‌పాస్ గడువును తెలంగాణ ఆర్టీసీ మరో 3 నెలలు పొడగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీ వరకు వరకు ఆర్టీసీ పొడగించింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లలో గడువు తీరిన పాస్‌ను అందజేసి సర్వీస్ చార్జి చెల్లించి కొత్త పాస్‌ను తీసుకోవాలని సూచించింది. కొత్త పాస్‌లు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు చెల్లుబాటవుతాయని పేర్కొంది.