విశాఖ శారదా పీఠాధిపతికి ‘విశ్వగురు పురస్కార్-2021’అవార్డు
విశాఖపట్టణం (CLiC2NEWS): “ఆర్ష విద్యా వాచస్పతి” విశ్వగురు పురస్కార్-2021ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’ సంస్థ అందించింది. విశాఖ శారదాపీఠంలో సోమవారం ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి కూడా ‘విశ్వగురు పురస్కార్- 2021’ అవార్డు ప్రదానం చేసినట్టు వెల్లడించారు. ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’ సంస్థ వ్యవస్థాపకుడు,సిఇఒ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారులు తుమ్మిడి రామ్‌కుమార్, తుమ్మిడి మణి, బ్రహ్మశ్రీ బానాల దుర్గా ప్రసాద్, సుందరపల్లి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.