చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పు వాయిదా..
విజయవాడ (CLiC2NEWS): ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. టిడిపి అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఎసిబి కోర్టు తీర్పు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఎసిబి కోర్టులో పిటిషన్ దాకలు చేశారు. సిఐడి తరపున అదనసు ఎజి పొన్నవోలు సధాకర్ రెడ్డి వారి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగిన ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారంకు వాయిదా వేసింది.
న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంటుందని, కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాఉల వాడిన నేరస్థులు ఉన్న జైలులో చంద్రబాబును ఉంచడం వల్ల ప్రమాదం ఉంటుందన్నారు. ఆయనకు ఎన్ ఎస్ జి భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు. హౌస్ రిమాండ్‌కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా కోర్టులో వివరించారు.