జైపుర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

జైపూర్ (CLiC2NEWS): మండల న్యాయ సేవాధికార‌ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జైపూర్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి పి రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ పార్వతపు రవి మాట్లాడారు…
మనిషి పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు చట్ట పరిధిలోనే ఉంటామని, చట్ట పరిధిలోనే నడుచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులందరూ ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన పెంచుకోవాలని అన్నారు.

కార్యక్రమములో పాల్గొన్న లాయర్లు చట్టాల మీద విద్యార్దులకు అవగాహన కల్పించారు. పలు చట్టాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ చందర్ గిల్డా, సీనియర్ అడ్వకేట్స్ కమల మనోహర్ , ఎం కార్తీక్, బండారి శ్రీనివాస్, జైపూర్ ఎస్సై శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపల్ కోలా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.