కాలం మారింది

కాలం మారి పోయింది
క్యాలెండరూ మారిపోయింది
ఈ ఉషోదయ వేళ
కొత్త వత్సర వేడుకకోసం ఉత్సాహం ఉరకలేసింది
నా జీవిత గమనాన్నినెమరు వేసుకున్నాను
కళ్లల్లో నా జ్ఞాపకాల చక్రం సినిమా రీలులా తిరిగింది
నా చుట్టూ షడ్రుచుల సమాజం
శుభోదయవేళ శుభాకాంక్షల సందేశాలు
ఆత్మీయ అనుబంధ అభినందనల మకరందాలు
అంతర్జాలపు స్నేహాలతో హాయ్ హాయ్‌లు
ఆత్మీయ సమూహాల్లో అచ్చట్లు ముచ్చట్లు
ముఖపుస్తక మిత్రులతో
మురిపించే తీయని కోయిల పాటలు
అబ్బో నన్ను నేనే మరిచిపోతి
మరో వైపు…
పండిన చింత పులుపు ఊరింపులు
పూతేలేని వేపచెట్టును చూసి దిగాలు
కొనలేని కార్పొరేట్ చదువుల బరువులు
మండుతున్న ఇంధన ధరల సెగలు
నిలకడ లేని నిత్యావసరాల వెలలు
హడలెత్తిస్తున్న హాస్పిటల్ ఖర్చులు
దడ పుట్టిస్తున్న విద్యుత్ ఛార్జీల పిడుగులు
కొత్త మిరప కారపు చురుకులు
బతుకుకోసం నిరాశల నిట్టూర్పులు
మాజీవితాలకు శోభను అందించవా
ఓ శుభకృతా
నీకు మరీ మరీ స్వాగతం
-ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్న లిస్ట్, హైదరాబాద్