క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు వ‌రాలు..

 హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ‌బిడ్డ పెండ్లి జరిగినా ప్ర‌భుత్వ స‌హాకారం ఉండాల‌ని, సిఎం కెసిఆర్ క‌ల్యాణ ల‌క్ష్మి , షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు ప్ర‌వేవ‌పెట్టార‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. ఆడబిడ్డ‌ల పెండ్లికి ముఖ్య‌మంత్రి కెసిఆర్ పెద్ద‌న్న‌గా నిలిచి రూ. 1,00,116 అంద‌జేస్తున్నార‌న్నారు.

టిఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్  ప్రెసిడింట్ కెటిఆర్ పిలుపు మేర‌కు మ‌హిళా దినోత్స సంబ‌రాల్లో భాగంగా సోమ‌వారం క‌ల్యాణ ల‌క్ష్మి ల‌బ్ధిదారుల ఇంటికి ఎమ్మెల్సీ క‌విత వెళ్లారు. వారితో క‌లిసి భోజ‌నం చేశారు. న‌గ‌రంలోని గౌరీ శంక‌ర్ కాల‌నీకి వ‌చ్చిన క‌విత‌కు కాల‌నీ వాసులు ఘ‌నంగా స్వాగతం ప‌లికారు. ఈసంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమానికి కృషి చేస్తుంద‌ర‌న్నారు. కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌తో బాల్య వివాహాలు త‌గ్గాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, కార్పొరేట‌ర్ మ‌న్నే కవిత రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.