పాముకాటుకు ఆకుపసరు పూసి.. తండ్రీ కొడుకులు మృతి
కామారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలోని ఓ ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు పాముకాటుకు గురయ్యారు. వీరు ఆస్పత్రికి వెళ్లకుండా ఏదో ఆకు పసరు పూసి, తగ్గిపోతుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ వారిరువురు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కుమారుడు వినోద్‌ను పాము కాటువేయగానే తండ్రి రవి దానిని చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే ఆపాము రవిని కూడా కాటువేసింది. స్థానికంగా దొరికిన ఆకుపసరు వేసి ఊరుకున్నారు. కొంత సమయానికి వినోద్ మృతి చెందగా.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రవిని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ రవి కూడా మృతి చెందాడు. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే ప్రాణాలు నిలిచేవంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.