కామారెడ్డి పట్టణంలో ఘనంగా బోనాలు ఉత్సవాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/swapnalok-bonalu.jpg)
కామారెడ్డి (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బోనాలు ఉత్సవాలు ఘనం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్పీఆర్ స్వప్నలోక్ కాలనీలో ఆదివారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కాలనీకి చెందిన మహిళలు బోనమెత్తుకొని కాలనీ ప్రధాన ద్వారం నుండి ఆలయం వద్దకు బోనాలు భాజా భజంత్రీలతో తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న మైసమ్మ ఆలయం వద్ద నైవేద్యాలు, బోనాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం నిర్వాహకులు కాలనీలోని ప్రతీ ఇంటికి వెళ్లి అమ్మవారి నైవేద్యం, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ గోదావరి స్వామి, 10 వార్డు కౌన్సిలర్ ఉరుదొండ వనిత రవికుమార్, ఎస్పీఆర్ యాజమాన్యం సుజాత మారుతి, స్వప్నలోక్ కాలనీ అధ్యక్షుడు ఉత్తమ్ రావ్, కార్యదర్శి విష్ణు వర్ధన్, కోశాధికారి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్ కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.