క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ క‌న్నుమూత‌

బెంగళూరు (CLiC2NEWS): కన్నడ ప‌వ‌ర్‌‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయ‌న శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తూ కుప్పకూలి ప‌డిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను బెంగ‌ళూరులోని విక్ర‌మ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఐసియూకి త‌ర‌లించి చికిత్స అంది‌స్తుండగా పునీత్ తుది శ్వాస విడిచారు. రాష్ట్ర సిఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆసుప‌త్రికి వ‌చ్చి పునీత్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత కొంత స‌మ‌యానికే ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ను ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టించారు. పునీత్ మ‌ర‌ణంతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగిపోయింది.
ఆయ‌న భౌతిక కాయాన్ని ముందు నివాసానికి త‌ర‌లిస్తారు. అనంత‌రం అభిమానుల సంద‌ర్శ‌నార్థం కంఠీర‌వ స్టేడియానికి త‌ర‌లించ‌నున్నారు. శ‌నివారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  క‌ర్ణాట‌కలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌తో పాటు ప్ర‌ధాన మార్గాల్లో సోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు సినిమా థియేట‌ర్లు మూసివేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.