కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో రెండో రోజు కంటి వెలుగు-2 కార్యక్ర‌మం

రామ‌గుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో సిపి రెమా రాజేశ్వరి ఆదేశాలసిబ్బంది, వారి కుటుంబ స‌భ్యుల కొర‌కు కంటివెలుగు -2 కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. గురువారం రెండో రోజు కంటివెలుగు శిబిరం ఏర్పాటుచేశారు. మొదటి రోజు 187 మంది సిబ్బంది రాగా.. రెండవ రోజు 137 మంది వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా 324 మంది కంటి పరీక్షల చేయించుకున్నారు. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కళ్లద్ధాలు అందించడం జరిగింది. చికిత్స అవసరం ఉన్న వారికి చికిత్స అందించడం జరుగుతుంది అని డాక్టర్స్ తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని రెండు రోజుల పాటు ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ ఐ శ్రీధర్, విష్ణు ప్రసాద్ లు, ఆర్ఎస్ ఐ లు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Leave A Reply

Your email address will not be published.