ఘట్కేసర్ లో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ఘట్కేసర్ (CLiC2NEWS): ఘట్కేసర్ లోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి సహిత విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘట్‌కేసర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహిస్తోంది. ఇక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఆదివారం గణపతి పూజా పూర్వాచనం నిర్వహించారు.
రెండో రోజు సోమవారం మండప ప్రతిష్ఠ అగ్నిప్రతిష్ఠ, జలాదివాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఆర్య వైశ్య సంఘం, ప్రస్తుతఅధ్యక్షులు బచ్చు శ్రవణ్ కుమార్, వ్యవస్తాపక అద్యక్షులు బచ్చు మారయ్య గుప్త, ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బచ్చు ప్రమోద్ గుప్త, మాజీ జిల్లా కోశాధికారి నగేష్ కుమార్ గుప్త, ప్రధానకార్యదర్శి బెలిదే శ్రీనివాస్ , గ్రామ శాఖ అద్యక్షులు బూరుగు చంద్ర శేకర్, ప్రధాన కార్యదర్షి శరత్ రవ్వ గుప్త, మాజీ ప్రధాన కార్యదర్శి పస్పునూరి చంద్రశేఖర్ గుప్త.. తదితరులు పాల్గొన్నారు.
మూడోరోజైన ఇవాళ (మంగళవారం) మండపారాధన, స్థాపిత దేవత పూజ, హోమం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం నిర్వహించనున్నారు.
బుధవారం విగ్రప్రతిష్ట, నేత్రోన్మిలనం, బలిహరణ, పూర్ణాహుతి, ఆశీర్వచనం, కుంకుమార్చన, తీర్థ ప్రసాద గోష్టి, అన్నప్రసాదం నిర్వహించనున్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసకుని వారి కృపకు పాత్రులు కాగలరని ఘట్‌కేసర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పేర్కొన్నారు.
Simply want to say your article is as surprising.
The clearness in your post is just excellent
and i could assume you’re an expert on this subject.
Well with your permission let me to grab your RSS feed to keep updated with forthcoming post.
Thanks a million and please continue the gratifying work.
We assume no liability for any action or inaction regarding transmissions, communications, or content provided
by any user or third celebration.
Hi there, its fastidious article regarding media print, we all be aware of media is a fantastic source
of information.