వెళ్ల‌కుమా.. శిశిరమా!

మా పచ్చని అడివంతా..

అరుణిమలు అద్దినట్లు..

సింధూరం దిద్దినట్లు..

 

అందాల గని లా

అడివంతా అల్లుకున్న సోయగాలు..

పగడపు కాంతుల మోదుగ పూలు..

 శిశిరాన ముద్దులొలికే గోగుపూలంటా అవి..

యే పరిమళాలు దాగున్నాయో మరి

మా మనసులు దోచుకెళ్లేలా…

యేదో మాయ ఉందే నీలో

మా కనులను కనికట్టు చేసేలా..

 

కొమ్మ కొమ్మలో.. నీ అద్భుతాలు..

ప్రకృతికి అవే అంతులేని ఆడంబరాలు..

కనులు వర్ణించలేని..

పెదవులు కాంచలేని..

నీ నారింజ వర్ణాలకు ముగ్ధురాలినయ్యాను

అందుకేనేమో..  బహుషా!
కావేమో కదా..!
సరి అయిన వర్ణనలు నావి..

 

వెళ్ళకుమా శిశిరమా..

మరిన్ని ప్రత్యూష పవనాలు వీయనీ..

ప్రకృతి ఒడిలో సేదతీరనీ..

-కవితాశరణ్


త‌ప్ప‌క‌చ‌ద‌వండి:  ‘జై భీం..’ చిరకాలం.. చిరస్మరణీయం..

Leave A Reply

Your email address will not be published.