బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధినేత కెసిఆర్ ఎన్నిక
హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ నూతన ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా పార్టీ అధినేత కెసిఆర్‌ను ఎన్నకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో నూతన ఎమ్మెల్యేలు కేశవరావు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా కెసిఆర్‌ను ఎన్నుకొన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ ఎస్ 39 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష హోదాలో నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. కెసిఆర్ ఆస్పత్రిలో ఉన్నందున శాసనసభలో జరిగే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి కెటిఆర్ హాజరుకాలేదు.