కెసిఆర్ కీలక నిర్ణయం.. టిఆర్ఎస్ `విజయగర్జన సభ` వాయిదా..
దీక్షా దివస్ రోజున ‘విజయగర్జన‘
హైదరాబాద్ (CLiC2NEWS): వరంగల్లో ఈ నెల 15న జరుగనున్న టిఆర్ఎస్ విజయ గర్జన సభ వాయిదా పడింది. ఈ సభను ఈ నెల 29వ తేదీ దీక్షా దివస్ రోజు సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
టిఆర్ఎస్ 20 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్లో అత్యంత ప్రతీష్టాత్మకంగా ఈ విజయ గర్జన సభ నిర్వహించాలని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.