విజయవాడలో బాలుడి కిడ్నాప్.. గంట వ్యవధిలో ఛేదించిన పోలీసులు

విజయవాడ (CLiC2NEWS): భవానీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఒక గంట వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీ పురం ప్రాంతానికి చెందిన మహిళ తన కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు సిసి టివి ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరు తెలంగాణ పోలీస్ శాకలో పనిచేసినట్లు సమాచారం. ఇంకా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు కూడా ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు బాలుడి తండ్రికి, నిందితులకు మధ్య ఆర్ధిక లావాదేవీల గొడవల కారణంగా ఈ కిడ్నాప్‌కు యత్నించినట్లు ప్రాథమిక సమాచారం.