గురుకుల పాఠ‌శాల విద్యార్థుల కిడ్నాప్.. చిన్నారులు క్షేమం

క‌ర్నూలు (CLiC2NEWS): జిల్లాలోని గురుకుల పాఠ‌శాల‌లో విద్యార్థుల కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది.  సి.బెళ‌గ‌ల్‌ గురుకుల పాఠ‌శాలలో 6,7 త‌ర‌గ‌తుల‌లో చ‌దువుత‌న్న‌ ఇద్ద‌రు విద్యార్థుల‌ను కొంద‌రు దుండ‌గులు కిడ్నాప్ చేసిన‌ట్లు సమాచారం. త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు ఎమ్మిగ‌నూరులో  వారు క్షేమంగా ఉన్న‌ట్లు గుర్తించారు. సాక్షులు, పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పాఠ‌శాల విరామ స‌మ‌యంలో కొంద‌రు దుండ‌గులు జీపులో వ‌చ్చి సూర్య‌తేజ‌, న‌వీన్‌లను ఎత్తుకెళ్లారు. అయితే వీరిని అప‌హ‌రించిన‌ద‌ది బంధువులేన‌న్న‌ట్లు తెలుస్తోంది. కుటుంబ క‌లహాల‌తో చిన్నారుల‌ను కిడ్నాప్ చేసి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. అప‌హ‌ర‌ణ‌కు గురైన చిన్నారులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.