టమాటాలు కోసం 2 కిలోమీటర్ల మేర క్యూలైన్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/queline-for-tomatos.jpg)
కడప (CLiC2NEWS): ప్రస్తుతం టామాటా ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. సామాన్యుడికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కడపలో స్థానిక రైతు బజారు వద్ద కిలో టామాటా రూ. 50కే విక్రయిస్తుండటంతో ప్రజలు ఉదయం 5 గంటల నుండే క్యూలైన్‌లో నుంచున్నారు. ఈ క్యూలైన్ దాదాపు 2 కిలో మీటర్ల మేర ఉండటం గమనార్హం. మధ్యాహ్నం దాటినా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఇక బయట మార్కెట్‌లలో కిలో టమాటా ధర రూ. 120 నుండి రూ. 150 వరకు ఉంది.
కిలో రూ. 10 ఉండే టమాటా ధర ఆమాంతం పెరిగిపోయింది. సామాన్యుడికి టమాటా అందని ద్రాక్ష అయ్యింది. మార్కెట్ టమాటా ధరలు చూసి కొనలేక వెనుదిరుగుతున్నాడు.
[…] […]