యుఎస్‌లో ఎంస్ చేస్తున్న తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి
ఖమ్మం (CLiC2NEWS): అమెరికాలో తెలుగు విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఖమ్మం నగరానికి చెందిన పుచ్చా వరుణ్ రాజ్ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంస్ చదువుతున్నాడు. అతను చదువుతో పాటు పార్ట్‌టైం జాబ్ కూడా చేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకొని రూమ్‌కి వెళుతుండగా ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడి చేసినట్లు యువకుని తండ్రి తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు ..పోలీసులకు సమాచారం అందివ్వటంతో అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థి తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసి తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని చేయాలని కోరారు.
[…] యుఎస్‌లో ఎంస్ చేస్తున్న తెలుగు విద్… […]