వన్డే ప్రపంచకప్‌ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన రెండవ బ్యాటర్ కోహ్లీ..
ప్రపంచకప్‌లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య వన్డే మ్యచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. విరాట్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయాలని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 88 పరుగుల వద్ద విరాట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో సచిన్ 49 శతకాల రికార్డును సమం చేస్తాడనుకున్న ఆశలకు నిరీక్షణ తప్పడం లేదు.
అర్థ శతకంతో వన్డే ప్రపంచకప్‌ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ 21 సార్లు ఈ ఘనత సాధించగా.. విరాట్ 13 సార్లు అందుకున్నాడు. రోహిత్ శర్మ 4 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. సెంచరీ కొంత దూరంలో వికెట్ కోల్పోయాడు.
ఇక శ్రీలంక 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. శ్రీలంక బ్యాటర్లుకు ఆదిలోనే షాక్ ఎదురైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిశాంక, కరుణరత్నె వెనుదిరిగారు. నిశాంక ఎల్బిడబ్ల్యూగా వెనిదిరగగా.. సిరాజ్ వేసిన బంతికి కరుణరత్నె వికెట్ల ముందు దొరికిపోయాడు. 1.5 ఓవర్‌కు సమర విక్రమ ఔటయ్యాడు. దీంతో 2 ఓవర్లకు శ్రీలంక స్కోరు 2జ3 చేసింది.