ఎపిఎస్ ఆర్టిసి ఛైర్మన్గా కొనకళ్ల నారాయణ ..

అమరావతి (CLiC2NEWS): ఎపిఎస్ అర్టిసి ఛైర్మన్గా కొనకళ్ల నారాయణ నియమితులయ్యారు. శనివారం ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ పలువురు టిడిపి నేతలు అభినందనలు తెలిపారు. ఆయన గతంలో రెండు సార్లు మచిలీపట్నం ఎంపిగా పనిచేశారు. టిడిపి , జనసేన , బిజెపి కూటమి పొత్తులో మచిలీపట్నం ఎంపి సీటు జనసేనకు కేటాయించడంతో నారాయణకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయనకు అధిష్టానం అర్టిసి ఛైర్మన్ గా నియమించింది.