తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి,రచయిత కొండా మోహన్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది.

ఈ పోటీలో తెలంగాణలో వరంగల్లు జిల్లా వలిమిడి గ్రామం లో పుట్టి హైదరాబాద్ లోని జలమండలిలో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా డిపుటేషన్ పై పని చేయుచున్న కవి, రచయిత కొండా మోహన్ ఎంపికయ్యారు.

ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద కొండా మోహన్
తమ కవితను వినిపించబోతున్నారు.

ప్రపంచ యవనికపై భారత దేశం యొక్క గొప్పతనాన్ని , ప్రపంచం కళ్ళు తెరవకముందే భారత దేశం లో నాగరికత ఎలా పరిఢవిల్లినదో చాలా అద్భుతంగా వివరించిన ” వసుధైక కుటుంబకం” అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది.

ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుకి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూరకి మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్ఛమైన భాషలో, సామాజిక స్పృహ కోసం సమస్యల పరిష్కారానికి సందేశాత్మక రచనలు చేసే కొండా మోహన్ గారు అంతకుముందు ” షిరిడికి పోయే వేళాయే” మరియు ” రారాజు జననం” అనే సాయిబాబా గీతాలు ఆడియో మరియు వీడియో కాసెట్ట్స్ సృజియించి మత సహనానికి బాటలు వేసి మన్ననలు పొందారు .

ఈరోజు(బుధవారం) హైదరాబాద్ జలమండలి మరియు రాష్ట్ర అటవీ శాఖ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన కొండా మోహన్ ని MD దాన కిషోర్ , PCCF(HOFF) R.M. డోబ్రియాల్, జలమండలి ఇంజనీర్లు, అటవీ శాఖ అధికారులు మిత్రులు మరియు కుటుంబ సభ్యులు సాహితీవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.