చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తి దారుల గొంతుకోశారు: కెటిఆర్
హనుమకొండ (CLiC2NEWS): బిసి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, బిసిల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. హనుమకొండలో నిర్వహించిన బిఆర్ ఎస్ నేతల సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయినదని.. డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బిసిల ఓట్ల కోసంమే కాంగ్రెస్ కులగణన జపం చేస్తోందని, చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తి దారుల గొంతుకోశారని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. అవి ఇచ్చాకే ఎలక్షన్ పెట్టాలన్నారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాగానీ, ఒబిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదని, కేంద్రంలో ఓబిసిలకు మంత్రిత్వశాఖ ఉండాలని కెసిఆర్ గతంలో కోరారన్నారు.