మంత్రి లోకేశ్ చొరవతో స్వస్థలానికి చేరుకున్న కువైట్ శివ

అమరావతి (CLiC2NEWS): ఎపికి చెందిన వ్యక్తి కువైట్లో తాను అనుభవిస్తున్న కష్టాల గురించి ఎక్స్‌లో వీడియో పోస్ట్‌చేయగా మంత్రి లోకేశ్ వెంటనే స్పందించారు. అతనని స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత టిడిపి ఎన్ ఆర్ై బృందానికి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఎపికి తీసుకొచ్చారు. అతను నేడు మదనపల్లికి చేరుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మదనపల్లికి చెందిన శివ .. కువైట్ లో తాను కష్టాలను అనుభవిస్తున్నానని, తనక సాయం చేయకపోతే చావే శరణ్యమంటూ వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన మంత్రి లోకేశ్ .. బాధితుడిని ఎపికి తీసుకొచ్చే వరకు స్వయంగా పర్యవేక్షించారు. బుధవారం శివ మదనపల్లికి చేరుకున్నాడు. అతనిని చూసని కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.