భద్రాచలంలో లక్ష్మీ నరసింహదాసు జయంత్యుత్సవం

భద్రాచలం (CLiC2NEWS): భద్రాచలంలో శ్రీరాజా తూము లక్ష్మీనరసింహదాసు 232వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్త రామదాసు అనంతరం నరసింహదాసు రామాలయం అభివృద్ధికి కృషి చేశారని ప్రతీతి. రామాలయంలో ప్రతీరోజు జరిగే దర్బారు సేవను నరసింహదాసు ప్రవేశపెట్టారని వైదిక పెద్దలు విశ్లేషించారు. కీర్తనలతో శ్రీరామ చంద్రమూర్తిని పూజించేపద్ధతిని అమలు చేసిన వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. నరసింహదాసు జయంతి ఉత్సవాల్లో ఆయన వంశస్థులు పాల్గొన్నారు. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో ఆయన చిత్రపటాన్ని ఊరేగించి గిరి ప్రదక్షణలు చేశారు. ఆలయంలోని ప్రధాన అర్చకులు సీతారామనుజాచార్చుల, విజయరాఘవన్ అధ్వార్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల సంగీతోత్సవం నిర్వహించారు. ఆలయ ఇఓ, ఎఇఓ ఏర్పాట్లను పర్యవేక్షించారు.