హయత్ నగర్‌లో ఒమిక్రాన్ కేసు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు మరొకటి నమోదైంది. రాజధాని హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో 23 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తి సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుడిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 25 కి చేరింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని వైద్యాధికారి నాగజ్యోతి తెలిపారు.