వివాహేత‌ర సంబంధం.. ఇద్ద‌రి ఆత్మ‌హ‌త్య‌

ఏలూరు (CLiC2NEWS): ప‌.గో జిల్లాకేంద్రం ఏలూరు లోని ప‌వ‌ర్‌పేట రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఓ వివాహిత‌, యువ‌కుడు రైలుకింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృతులను ఏలూరుకు చెందిన అరుణ‌కుమారి, రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన విన‌య్‌గా గుర్తించారు. వ‌దిన, మ‌రిది అని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌యింది. కాగా వివాహేత‌ర సంబంధ‌మే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చూస్తున్నారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.