యోగేశ్వర్‌కు ‘లీడ్ ఇండియా’ జాతీయ అవార్డు
హైదరాబాద్ (CLiC2NEWS): భారత రత్న స్వర్గీయ రాష్ట్రపతి ఏ పి.జె అబ్దుల్ కలాం 90వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో పర్యావరణ రక్షణలో గత 21.సం.నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు మంచిర్యాల జిల్లా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు మరియు తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ కో.ఆర్డినేటర్, రాష్ట్ర పర్యావరణ విద్య ట్రైనర్ గుండేటి యోగేశ్వర్‌కు లీడ్ ఇండియా జాతీయ స్థాయి అవార్డును ప్రదానం చేశారు.
లీడ్ ఇండియా జాతీయ వ్యవస్థాపకలు డా. ఎన్.బి సుదర్శన్. డా. ఆచార్య ,లీడ్ ఇండియా సి.ఈ. ఓ ఆర్మీ ఉన్నతాధికారి మేయర్ మధుకరన్ ఎం.ఎల్. ఎ హరిప్రియ ,అవార్డు ప్రదానోత్సవ ముఖ్య బాధ్యులు..కండల పాపిరెడ్డి, ఆకుల రామచంద్రయ్య చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు.
సందర్భంగా జిల్లాకు గుర్తింపు తెచ్చిన యోగేశ్వర్ ను డి.ఈ. ఓ ఎస్. స్ వేంకటేశ్వర్లు,కార్యాలయ వివిధ అధికారులు, పాటశాల హెచ్.ఎం దుర్గయ్య, ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు,వివిధ సాహిత్య, సాంస్కృతిక సామాజిక సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.