Mandapeta: ఎమ్మెల్సీ `తోట`ను మర్యాద పూర్వకంగా కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

మండపేట (CLiC2NEWS): మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తొలిసారిగా ఎమ్మెల్సీ అయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణులు వెంకటాయపాలెంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళి కలిసి అభినందనలు తెలియజేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేసీ ప్రసాద్ ఆధ్వర్యంలో వీరంతా ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వీరమల్లు శ్రీనివాస్, మండల పట్టణ అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పింపోలు పోలరాజు, మండపేట కామాక్షి వడ్రంగి పని వారల సంఘం ప్రెసిడెంట్ కోటిపల్లి కృష్ణమాచార్యులు, గోడి సుబ్రహ్మణ్యం, రామోజు కృష్ణ, దార్ల నాగు, నానాజీ, మండపేట స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ వెదురుపర్తి నారాయణ, ప్రధాన కార్యదర్శి నరిగిరి కృష్ణ, పెదగాడి కృష్ణ, మాజీ కౌన్సిలర్ అత్తిలి సత్యనారాయణ, చిట్టూరి శ్రీనివాస్, కానూరి శ్రీనివాస్, టేకి శ్రీనివాస్, కింతాడ హేమ సుందర్ శ్రీనివాస్, కొమ్మోజు బల్లబ్బాయి, డొంకా సత్యనారాయణ, కొచ్చర్ల కోటేశ్వరరావు, పట్నాల బుజ్జి పాల్గొన్నారు.
Appreciate the recommendation. Will try it out.