ఇవాళ నాగార్జున సాగర్‌ గేట్ల ఎత్తివేత

నాగార్జున‌సాగ‌ర్‌(CLiC2NEWS): ఈ మ‌ధ్య‌కాలంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు వాటి మూలంగా పోటెత్తుతున్న వరదతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుకుంది. ఇప్పుడు సాగ‌ర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దాంతో ఇవాళ (ఆదివారం) సాయంత్రం వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయిలోకి చేరుకునే అవకాశం ఉంది. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గేట్లను ఎన్‌ఎన్‌పీ అధికారులు క్రస్ట్‌ గేట్లను పరిశీలించారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు.

  • ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,80,222 క్యూసెక్కుల
  • ఔట్‌ఫ్లో 37,743 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
  • ప్రస్తుతం నీటిమ‌ట్టం 579.20 అడుగుఅఉ
  • గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు.
  • ప్రస్తుతం డ్యామ్‌లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Leave A Reply

Your email address will not be published.