Hyd: మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): హైద‌ర‌బాద్ పాతబస్తీలో బోనాల పండుగ సంద‌ర్భంగా నగరంలో మద్యం దుకాణాలు మూసివేయ‌నున్నారు. ఆదివారం (రేపు) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను బంద్‌ చేయాలని నిర్వాహకులను పోలీసు ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌, రాచ‌కిండ‌, సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్లు వేర్వేరు నోటిఫికేష‌న్లు జారీ చేశారు.

బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం షాపులపై గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు. క‌గా మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూసివేస్తార‌ని తెలుసుకున్న మందు బాబులు ముందుగానే మ‌ద్యం కొనుగోలు చేస్తున్నారు. ఇవాళ (శ‌నివారం) సాయంత్రం నుంచే దుకాణాలు అన్నీ కిట‌కిట‌లాడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.