యాక్సిడెంట్ చేసి తప్పించుకు తిరుగుతున్న లారీ డ్రైవర్ అరెస్ట్
జైపూర్ (CLiC2NEWS): యాక్సిడెంట్ చేసి ఒకరి మరణానికి కారణమై తప్పించుకు తిరుగుతున్న ఛత్తీస్ ఘడ్ చెందిన డ్రైవర్ ను లారీతో సహా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివారులో HKRR బ్రిడ్జి కనస్ట్రక్షన్ యార్డు వద్ద ఈనెల 12వ తేదీన దాసరి రాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని లారీ ఢీకొనిపోయింది. మరణించిన వ్యక్తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ సిసి పుటేజి ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను లారీతో సహా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన జైపూర్ ఎస్సై రామకృష్ణ, అదనపు ఎస్సై గంగరాజు గౌడ్, జైపూర్ పోలీస్ సిబ్బంది HC’s ఇజాజ్, శ్రీనివాస్ PC’s రాజశేఖర్, బాస్కర్ లను సిపి చంద్రశేఖర్, మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ అభినందించారు.