ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దాడిగె సందీప్ కుమార్

దేవరుప్పుల (CLiC2NEWS): విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దాడిగె సందీప్ కుమార్ ఆరోపించారు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండల మహాసభలో ముఖ్యఅతిథిగా సందీప్ పాల్గొని* మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేసిందని కనీసం, 30% నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ ఊసే లేకుండా పోయిందన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, పేద మధ్య తరగతి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో అది నోటిఫికేషన్ లకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచింది అన్నారు. మండల కేంద్రంలో మూసుకుపోయిన హాస్టళ్లను తెరవాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దాదాపు మూడు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు . తక్షణమే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి అందుబాటులో విద్యను ఉండేలా చూడాలన్నారు . అనంతరం నూతన మండల కమిటీ ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొందుగుల ఆనంద్, కార్యదర్శిగా దొడ్డి సురేష్, ఉపాధ్యక్షులుగా లోడంగి సాయి, ఆర్అశ్విని, అఖిల, సాయి ,సహాయ కార్యదర్శులుగా అజయ్,తోటకూరి అఖిల, యస్క అస్లాం, పూజ, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తేజవత్ గణేష్ , లావుడియా అనిల్ చౌహాన్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.