ఇవిఎం ధ్వంసం ఘటన.. అధికారులపై సస్పెన్షన్ వేటు

మాచర్ల (CLiC2NEWS): నియోజక వర్గం రెంట చింతల మండలం పాల్వాయిగేటు ఇవిఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులను సస్పెన్షన్ చేశారు. ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలోని ఇవిఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రంలో ప్రిసౌడింగ్ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్ కళాశాల అధ్యపకుడు సుబ్బారావను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. పోలింగ్ అధికారిగా ఉన్న వెంకటాపురం జడ్‌పి స్కూల్ అసిస్టెంట్ షహనాజ్ బేగంపైనా చర్యలు తీసుకున్నారు.