చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మద్ది కార్తీక్ ఏకగ్రీవం..

చెన్నూరు (CLiC2NEWS): చెన్నూరు బార్ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిగా మద్ధి కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎస్ రమేష్.. గౌరవ అధ్యక్షుడిగా మల్లేష్ గౌడ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంతో చెన్నూర్ బార్ అసోసియేషన్ మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని న్యాయవాదులు ఆకాక్షించారు.