Maharashtraలో Phase 3 vaccination మొదలు!

నాగ్‌పూర్ (CLiC2NEWS): దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఫేజ్-3 వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కేంద్ర సర్కార్ మార్గదర్శకాల మేరకు ఇవాళ ఫేజ్-3లో 18-44 ఏండ్ల మధ్య వయసు వాళ్లందరీకి టీకాలను ప్రారంభించారు. అయితే కేంద్రం నుంచి వ్యాక్సిన్ డోసులు సమయానికి అందకపోవడంతో పలు కేంద్రాల్లో టీకా పంపిణీ నిలిపి వేశారు. వ్యాక్సిన్లు అందిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని ఓ టీకా కేంద్రానికి కూడా వ్యాక్సిన్లు వస్తున్నట్లు సమాచారం అందింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తమ కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో టీకా కేంద్రం వద్ద జనం భారీ ఎత్తున బారులు తీరారు.
Maharashtra: Phase 3 vaccination for #COVID19 begins. Visuals from a centre in Nagpur.
An official at the centre says, “We’ve received update from head office that vaccine will be administered only to people between 18-44 yrs of age today. Their vaccination will begin at 2 pm.” pic.twitter.com/t7YCd01mdV
— ANI (@ANI) May 1, 2021