Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

థానే (CLiC2NEWS): ఇవాళ (బుధ‌వారం) తెల్ల‌వారు జామున మహారాష్ట్రలోని ఓ ఆసుప‌త్రిలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో న‌లుగురు రోగులు మ‌ర‌ణించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారి వెల్ల‌డించారు. ..
“థానేలోని ప్రైమ్ క్రిటికేర్ హాస్పిట‌ల్‌లో ఈ రోజు (బుధ‌వారం) తెల్ల‌వారు జామున అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగుల‌ను వేరే ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.` అని అధికారి తెలిపారు. ఇటీవలే థానేలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఐదుగురు కరోనా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.