Maharashtra: బిల్డింగ్ పైకప్పు కూలి ఏడుగురు మృతి

ముంబయి(CLiC2NEWS): మహారాష్ట్ర థానేలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి 7 మృతదేహాలు వెలికి తీసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఉల్లాస్‌నగర్‌లోని నెహ్రూచౌక్ వద్ద ఉన్న ఈ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు కూలిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.