నేటి నుండి పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ పొదుపు పథకం అమలు..

ఢిల్లీ (CLiC2NEWS): నేటి నుండి మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త పొదుపు పథకం అమలులోకి రానుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మహిళా సమ్మాన్ పొదుపు పథకం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది. 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వాదా మహిళలు లేదా బాలికల పేరుపై మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లను పొందే అవకాశం ఉంది. ఈ పథకం 2023 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి 7.50 స్థిర వడ్డీ రేటును ప్రకటించారు. డిపాజిట్ పై రూ.2 లక్షల గరిష్ట పరిమితి ఉంది.