ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం.. కోట్ల‌లో ఆస్తి న‌ష్టం

ఏలూరు (CLiC2NEWS): జిల్లాలోని సోమ‌వ‌ర‌ప్పాడులో ఉన్న ఓ ఫ్యాక్ట‌రీలో భారీఅగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దుర్గ క్వాయ‌ర్ ఇంప్లెక్స్ ఫ్యాక్ట‌రీలో మంట‌లు చెల‌రేగాయి. భారీగా మంట‌లు వ్యాపించ‌డంతో భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. స‌మాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో సుమారు రూ.ఐదు కోట్ల న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.