జగ్గయ్యపేట మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం..
మిర్చి నిల్వలు దగ్ధం

జగ్గయ్య పేట (CLiC2NEWS): ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలం తొర్రగుంటపాలెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిర్చి శీతల గిడ్డంగిలో మంటలు అలుముకుని మిర్చి నిల్వలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గిడ్డంగిలో దాదాపు రూ.12 కోట్ల విలువైన మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.