హైదరాబాద్ లో జరిగే దళిత శక్తి ప్రోగ్రాం ప్లీనరీ విజయవంతం చేయండి..

 భూపాల‌ప‌ల్లి (CLiC2NEWS): అక్టోబ‌రు 31వ తేదీన హైదరబాద్ జరిగే దళిత శక్తి ప్రోగ్రాం ప్లినరిని విజయవంతం చేయాల‌ని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ కోరారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జిల్లాకేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం స‌భ‌కు సంబంధించిన కరపత్రం విడుద‌ల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఈ దళిత శక్తి ప్రోగ్రాం (DSP) sc, st, bc పీడిత ప్రజల విముక్తి కొరకు పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంబెడ్కర్, కాన్షిరాం ఆశ‌యాల సాధ‌న కోస‌మే తెలంగాణ రాష్ట్రంలో దళిత శక్తి ప్రోగ్రాం (DSP) పురుడుపోసుకుంద‌ని తెలిపారు. దళిత శక్తి ప్రోగ్రాం ప‌న్నెండేళ్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ నెల 31 న హైదరాబాద్ లో DSP ప్లీనరీ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మహారాజ్ రవీందర్ మహారాజ్, కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి శంకర్ ,ఉపాధ్యక్షుడు ప్రభుదాస్, మండల కార్యదర్శి మహర్షి , కడపాక రవి , పుల్లా తిరుపతయ్య ,సదయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.