Mancherial: బెల్లంపల్లిలో వరుసగా మరణాలు!

మంచిర్యాల CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వరుసగా కరోనా మరణాలు నమోదువుతున్నాయి. బెల్లంపల్లిలోని ఐసోలేషన్ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 8 మంది మృత్యువాతపడగా.. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. ప్రయివేటు దవాఖానాల్లో చికిత్స పొంది పరిస్థితి విషమించిన తర్వాత రోగులు ఇక్కడికి వస్తున్నారని.. అందుకే ఏమీ చేయలేకపోతున్నామని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు.