మంచిర్యాల: ఎటిఎం చోరీకి విఫలయత్నం!

జైపూర్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని SBI ఏ.టి.యం. లో చోరీకి విఫలయత్నం జరిగింది. నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఎటిఎంను ధ్వంసం చేశారు. ఆ సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. ఎ.టి.యం. వద్ద గ్యాస్ కట్టర్ , ఇనుప రాడ్లను దుండగులు అక్కడే వదిలి పారిపోయారు.
పోలీసులు ఎటిఎం కేంద్రాన్ని పరిశీలించగా ఘటనా స్థలంలో గ్యాస్ కట్టర్లు, ఇనుపరాడ్లు లభించాయి. వెంటనే పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎటిఎంలో ఉన్న రూ. 22 లక్షలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎటిఎం కేంద్రంలోని సిసి పుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.