మంచిర్యాల: టాపీ మేస్త్రీల కు భవన నిర్మాణ సంఘం ఆర్థిక సాయం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/mncl-bhavana-nirmana-sangam.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా కేంద్రంలో చినిపోయిన టాపీ మేస్త్రీల కుటుంబ సభ్యులకు, గాయపడిన మేస్త్రీలకు భవన నిర్మాణ సంఘం ఆర్థిక సాయం అందజేసింది. ఆదివారం భవన నిర్మాణసంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అధ్యక్షుడు రామ్ రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామ్ రాజయ్య మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ సంఘం పాటు పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దెబ్బటి శ్రీనివాస్, కోశాధికారి ఎనగందుల అంకుస్, ఉపాధ్యక్షుడు పెద్ద పెళ్లి సూరయ్య, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/mncl-bhavana-nirmana-sangam3.jpg)
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/mncl-bhavana-nirmana-sangam2.jpg)
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?